బెల్లంకొండ రెండో కొడుకు కూడా హీరో అవుతున్నాడు


నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ఇద్దరు కొడుకులు అన్న విషయం తెలిసిందే . పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించాడు . అయితే కమర్షియల్ హిట్ మాత్రం ఇప్పటివరకు అందుకోలేకపోయాడు . కమర్షియల్ హిట్ లేకపోయినప్పటికీ హీరోగా మాత్రం రాణిస్తూనే ఉన్నాడు ……. సక్సెస్ కోసం గట్టిగా కృషి చేస్తున్నాడు .

ఇక ఇప్పుడు బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా మారుతున్నాడు . ఫణి అనే యువ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు తెలుస్తోంది . యూత్ ఫుల్ కంటెంట్ తో ఆ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది . పెద్ద కొడుకు హీరోగా వచ్చాడు ఓకే మరి రెండో కొడుకైనా సాలిడ్ హిట్ కొడతాడా చూడాలి .బెల్లంకొండ గణేష్ బాబు కొన్ని సినిమాలకు సమర్పకులుగా , నిర్మాతగా వ్యవహరించాడు అయితే నటన పట్ల గాలి మళ్లడంతో హీరోగా వస్తున్నాడు .