మళ్ళీ కమర్షియల్ పంథాలో బెల్లంకొండ


మళ్ళీ కమర్షియల్ పంథాలో బెల్లంకొండ
మళ్ళీ కమర్షియల్ పంథాలో బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్ ఎట్టకేలకు రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇది తనకు చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. రాక్షసుడు హిట్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తనకు సూట్ అయ్యే కథల్ని ఎంచుకునే పనిలో పడ్డాడు. గత రెండు, మూడు సినిమాలుగా డ్యాన్సులు, ఫైట్లు ఎక్కువగా లేని సినిమాలు చేసిన బెల్లంకొండ ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా చేయాలని
కోరుకుంటున్నాడు.

అందుకోసమే సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథను ఓకే చేసిన బెల్లంకొండ, దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్.. హైపర్ తర్వాత మైత్రి సంస్థతో సినిమా కమిట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తీయాలని మైత్రి సంస్థ భావించింది.

అయితే పవన్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అలాగే సంతోష్ శ్రీనివాస్ కు మరో హీరోను కూడా మైత్రి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మైత్రి నుండి బయటకు వచ్చి బెల్లంకొండతో సినిమాను కమిట్ అయ్యాడు బెల్లంకొండ.