బెల్లంకొండ రెండో కొడుకు కూడా హీరో అవుతున్నాడు


Bellamkonda younger son Ganesh debut as hero 

అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన బెల్లంకొండ సురేష్ తన పెద్ద కొడుకు ని హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడున్న హీరోలలో ఎవరూ అంత భారీ బడ్జెట్ చిత్రాలు చేయలేదు అయినప్పటికీ తన పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని స్టార్ హీరోగా చేయడానికి భారీ ఎత్తున భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాడు . కానీ అవన్నీ బెడిసి కొట్టాయి , ఒక్క అల్లుడు శీను చిత్రం మాత్రమే ఓ మాదిరిగా ఆడింది అంతే .

కట్ చేస్తే ఇప్పుడు చిన్న కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . బెల్లంకొండ చిన్న కొడుకు పేరు గణేష్ , బెల్లంకొండ సురేష్ నిర్మించిన కొన్ని చిత్రాలకు సమర్పకుడిగా , నిర్మాతగా వ్యవహరించాడు బెల్లంకొండ గణేష్ . అయితే పెద్ద కొడుకు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో చిన్న కొడుకు గణేష్ ని హీరోగా పరిచయం చేసే కార్యక్రమం చేపట్టాడు . మరి ఈ చిన్న కొడుకైనా సాలిడ్ హిట్ కొట్టి హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా ? చూడాలి . పాపం ….. బెల్లంకొండ సురేష్ తన కొడుకుల కోసం బాగానే కష్టపడుతున్నాడు , బాగానే తపన పడుతున్నాడు .

English Title: Bellamkonda younger son Ganesh debut as hero