వెంకీ మామకు అదొక్కటే అవకాశం


Venky Mama
వెంకీ మామకు అదొక్కటే అవకాశం

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వెంకీ మామ చిత్ర షూటింగ్ ఒక్క మినహా పూర్తైన సంగతి తెల్సిందే. ఈ పాటను కూడా త్వరగా చిత్రీకరించి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా చాలా ఆలస్యమైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా రోజుల పాటు సాగాయి.

షూటింగ్ కూడా నత్తనడకన జరిగింది. దీనివల్ల ముందు అనుకున్న దసరా విడుదల జరగలేదు. పోనీ దీపావళికైనా ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకుంటే ఇప్పటికే చాలా చిత్రాలు పండగకు షెడ్యూలై ఉన్నాయి. క్రిస్మస్ కి కూడా అదే ఇబ్బంది. మూడు నుండి నాలుగు చిత్రాలు ఆ డేట్ ను టార్గెట్ చేసుకుని షూటింగ్ చేసుకుంటున్నాయి. అయినా క్రిస్మస్ అంటే అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. సరైన సమయం చూసి సినిమాలు విడుదల చేసే అలవాటున్న సురేష్ బాబు, ప్రస్తుతం వెంకీ మామ ముందున్న అవకాశం డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసుకోవడమే. అప్పుడైతే పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.