మ‌హేష్‌కు త‌ల్లిగా బాలీవుడ్ న‌టి?


మ‌హేష్‌కు త‌ల్లిగా బాలీవుడ్ న‌టి?
మ‌హేష్‌కు త‌ల్లిగా బాలీవుడ్ న‌టి?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మహేష్ న‌టిస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  మైత్రీ మూవీమేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. నివేదా థామ‌స్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై సెటైరిక‌ల్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఓ క్రేజీ న‌టుడు ఇందులో విల‌న్‌గా న‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్‌ల‌తో చిత్ర బృందం చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది. ఉపేంద్ర‌, సుదీప్‌, అర‌వింద స్వామి వంటి న‌టుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవ‌రు ఫైన‌ల్ అవుతార‌న్న‌ది త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానుంది.

ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీల‌క‌మైన హీరో తల్లి పాత్ర‌లో ఒక‌ప్ప‌టి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్, `మైనే ప్యార్ కియా` ఫేమ్‌ భాగ్య‌శ్రీ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. 51 ఏళ్ల భాగ్య‌శ్రీ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రంలో హీరోకు త‌ల్లిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో పాటు జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా కంగ‌ణ ప్ర‌ధాన పాత్ర‌లో ఏ.ఎల్‌. విజ‌య్ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్న `త‌లైవి` చిత్రంలోనూ న‌టిస్తోంది.