ప్ర‌భాస్ కోసం ఆమెని దించేస్తున్నారుగా!


ప్ర‌భాస్ కోసం ఆమెని దించేస్తున్నారుగా!
ప్ర‌భాస్ కోసం ఆమెని దించేస్తున్నారుగా!

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ స్థాయి పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా త‌రువాత చేసిన `సాహో` కూడా ఆ స్థాయిలోనే వుండ‌టంతో తదుప‌రి చిత్రం కూడా ఆ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. యువీ క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

`జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. సినిమా కోసం అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన సెట్‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టారు. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం పారిస్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ గ‌త చిత్రాల‌కు మించిన భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ చిత్రాల్లోనే చాలా రిచ్‌గా రూపొందిస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి త‌ల్లిగా కీల‌క పాత్ర‌లో అల‌నాటి పాపుల‌ర్ న‌టి భాగ్య‌శ్రీ న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ వెల్ల‌డించిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం. 1989లో వ‌చ్చిన `మైనే ప్యార్ కియా` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత తెలుగులో బాల‌కృష్ణ న‌టించిన `రాణా`లో, రాజ‌శేఖ‌ర్ `ఓం కారం` చిత్రంలోనూ న‌టించిన భాగ్య‌శ్రీ మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత తెలుగు సినిమాలో ప్ర‌భాస్‌కు త‌ల్లిగా న‌టించ‌బోఉండ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది.