`భ‌‌లేగుంది బాలా…..`ట్రాక్ మార్చిన మిక్కీ జె. మేయ‌ర్


`భ‌‌లేగుంది బాలా.....`ట్రాక్ మార్చిన మిక్కీ జె. మేయ‌ర్
`భ‌‌లేగుంది బాలా…..`ట్రాక్ మార్చిన మిక్కీ జె. మేయ‌ర్

శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `శ్రీ‌కారం`. వ‌రుస ఫ్లాపుల త‌రువాత చేస్ఉత‌న్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. `నాని గ్యాంగ్ లీడ‌ర్` ఫేమ్ మాళ‌విక అరుల్ మోహ‌న్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా కిషోర్ బి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం తాజాగ రిలీజ్ చేసింది. `దారి చూడు గుమ్మ చూడు మామా..` ఫేమ్ పెంచ‌ల్ దాస్ ఈ పాట రాయ‌డ‌మే కాకుండా ఆల‌పించారు. రాయ‌ల సీమ ప‌ల్లె ప‌దాల స్టైల్లో ఈ పాట‌ని యువ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీ జె. మేయ‌ర్ కంపోజ్ చేశారు. `భ‌లేగుంది బాలా..` అంటూ సాగే ఈ పాట‌లో శ‌ర్వానంద్ లుంగీ క‌ట్టుకుని మాస్ అప్పీల్‌తో మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొడుతున్నారు. ప్రియాంక అరుల్ మోహ‌న్ సంప్ర‌దాయ ప‌రికిణీలో ప‌ల్లెటూరి అమ్మాయిగా హొయ‌లు పోతూ క‌నిపించింది.

క్లాస్ మ్యూజిక్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఇంత వ‌ర‌కు ముద్ర వేసుకున్న మిక్కీ జె. మేయ‌ర్ ఈ మూవీతో ఆ ముద్ర‌ను చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌ల్లె ప‌దాల‌తో క్యాచీగా పెంచెల దాస్ రాసిన ఈ పాట‌కు అదే స్థాయిలో మిక్కీ జె మేయ‌ర్ మాస్ బీట్‌ని అందించ‌డంతో పాట ఆక‌ట్టుకుంటోంది. ఆడియ‌న్స్‌కి ఈ పాట అమితంగా న‌చ్చేలా వుంది.