భరత్ అనే నేను కలెక్షన్లు సరైనవి కావా


bharat ane nenu collections are not fake says producer dvv danayyaమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న విడుదలై భారీ విజయం సాధిస్తోంది , అలాగే మంచి కలెక్షన్లు కూడా సాధిస్తోంది అయితే భరత్ అనే నేను సినిమా సాధిస్తున్న వసూళ్ల కంటే ఎక్కువ కలెక్షన్లు చూపిస్తున్నారని నిర్మాత డివివి దానయ్య పై ఆరోపణలు వస్తున్నాయి . ఫిలిం నగర్ లో ఈ వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ కావడంతో అవి నిర్మాత దానయ్య చెవిన పడ్డట్టున్నాయి అందుకే నిన్న స్పందించాడు .

భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోందని , ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 161 కోట్లు కలెక్ట్ చేసిందని ఇవి ఫేక్ కలెక్షన్లు కాదని …… మాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదని ఫేక్ కలెక్షన్లు అని వస్తున్న వార్తలను ఖండించాడు . అయితే నిర్మాత ప్రకటిస్తున్నట్లుగా అన్ని వసూళ్లు వచ్చాయా ? లేదా ? అన్నది పక్కన పెడితే వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్ల నే సాధిస్తున్నాడు మహేష్ . ఇప్పటివరకు 150 కోట్ల గ్రాస్ అయితే దాటింది కానీ నిర్మాత కాస్త ఎక్కువ చేసి చెబుతున్నాడు అని గుసగుసలు .