భరత్ అనే నేను రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా


 Bharat Ane Nenu Review and Ratingమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా భారీ అంచనాల మధ్య రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఈరాత్రి కి ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇక యూకే లో రేలీజ్ కి ముందు అక్కడ మళ్లీ సెన్సార్ చేస్తారు కాబట్టి ఉమైర్ సందు అనే క్రిటిక్ , సెన్సార్ మెంబర్ భరత్ అనే నేను చిత్రాన్ని చూసాడు అంతేకాదు రివ్యూ కూడా ఇచ్చేసి రేటింగ్ ఇచ్చాడు.

ఇంతకీ భరత్ అనే నేను చిత్రానికి ఉమైర్ సందు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా…… 4 /5 . అయిదు కి గాను నాలుగు అంటే బ్లాక్ బస్టర్ అన్నమాటే ! . మహేష్ అద్భుత నటన కు ప్రేక్షకులు మంత్రముగ్దులు అవడం ఖాయమని , కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ , దానయ్య నిర్మాణ విలువలు …… కైరా గ్లామర్ వెరసి భరత్ అనే నేను విజువల్ ఫీస్ట్ అని అంటున్నాడు. ఇతగాడు రేటింగ్ ఇచ్చిన సినిమాలు హిట్స్ కంటే డిజాస్టర్ లే ఎక్కువ కానీ భరత్ అనే నేను చిత్రానికి మాత్రం నిజంగానే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి సో ….. భరత్ అనే నేను హిట్ ఖాయం అయితే ఏ రేంజ్ అన్నది మాత్రం రెండు మూడు రోజుల్లోనే తేలనుంది.