200 కోట్ల క్లబ్ లో భరత్ అనే నేను


Bharat Ane Nenu world wide  Box Office Collectionమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది . మహేష్ కున్న క్రేజ్ కి భరత్ అనే సినిమా కాన్సెప్ట్ కూడా తోడవ్వడంతో కేవలం రెండు వారాల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరి ఆశ్చర్యానికి గురిచేసింది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు . వేసవి సెలవులు కావడం భరత్ అనే నేను చిత్రానికి బాగా కలిసి వచ్చింది . దాంతో తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాడు మహేష్ బాబు .

వరల్డ్ వైడ్ గా 200 కోట్లు సాధించడంతో మహేష్ తో పాటు ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే పే చేసింది భరత్ అనే నేను , అలాగే ఓవర్ సీస్ లో కూడా మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకుంది . ఓవర్ సీస్ లో మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది దాంతో ఈ మార్క్ సాధ్యమైంది . రెండు వారాల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది . మహేష్ బాబు సరసన కియారా అద్వానీ నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన భరత్ అనే నేను ప్రేక్షకులను కనువిందు చేస్తోంది .