రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడికి ఏం పని?

Kamal Haasan
రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడికి ఏం పని?

భారతీయుడు 2 షూటింగ్ కు వెళ్లకముందే పలు సమస్యల్లో పడింది. మొదట అనుకున్న నిర్మాత మారిపోయాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తారాగణమంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్ నాలుగైదు రోజులుగా అక్కడ సాగుతోంది. కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే కాజల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.