భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్


bharath ane nenu first day collections మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే . కాగా మొదటి రోజున భరత్ అనే నేను 58 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి దాంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 58 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసాడు మహేష్ బాబు .

 

మొదటి రోజునే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటుగా వసూళ్ల వర్షం కూడా కురుస్తుండటంతో నాన్ బాహుబలి చిత్రాల్లో భరత్ అనే నేను చిత్రం నెంబర్ వన్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మహేష్ ముఖ్యమంత్రి గా సరికొత్తగా కనిపించడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది .