భరత్ అనే నేను ఓవర్సీస్ టాక్ ఎలా ఉందో తెలుసా


Bharath ane nenu overseas talkసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో అయితే ఏకంగా ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షోల టాక్ ప్రకారం భరత్ అనే నేను ఎలా ఉందో తెలుసా ……

ఫస్టాఫ్ చాలా బాగుందట , మహేష్ బాబు ముఖ్యమంత్రి గా అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నాడట . అలాగే కైరా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ కానుందట . డివివి దానయ్య నిర్మాణ విలువలు , కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ , డైనమైట్ లా పేలే డైలాగ్స్ వెరసి భరత్ అనే నేను సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఎదురుచూడాల్సిందే.