సెంట్రల్ జైలులో మన భారతీయుడు …

Kamal Haasan
సెంట్రల్ జైలులో మన భారతీయుడు …

ఏంటి మన భారతీయుడు సెంట్రల్ జైలు అని కంగారుపడుతున్నారా? ఇక్కడే మీరు కంగారు పడకుండా అలోచించి చదవాల్సిన కథ.

నేను చెప్పేది అక్షర్రాల తమిళ, తెలుగు లో ఒక పుస్తకాన్ని రూపు దిద్దుకున్న హీరో “కమలహాసన్” గారి గురించి. ఆయన ఇప్పుడు ఏం సినిమా చేయబోతున్నడో మనకి తెలుసు కదా, అదే “భారతీయుడు-2” సినిమా.

తెలుగులో మొదటి సారి డబ్బింగ్ లో వచ్చినా కూడా చెప్పిన లంచం గురించి జనాలకి బాగా నచ్చడంతో “భారతీయుడు” సినిమా అప్పట్లో ప్రబంజనం సృష్టించింది. ఆ సినిమా మాటలు, పాటలు ఇప్పటికి ప్రజల ఇంట్లో, ఫోన్ లో మోగుతూనే ఉంటాయి, అంతలా ఉంటాయి ఈ సినిమాలో అన్ని సంభాషణలు, పాటలు.

అలాంటిది దానికి కొనసాగింపుగా వస్తున్న భారతీయుడు-2 ఇంకెంత ప్రబంజనం సృష్టిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా రాజమండ్రి సెంట్రల్ జైలు లో, జైలు కి సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు “శంకర్” గారు చిత్రికరిస్తున్నారు. ఇందులో కమలహాసన్ గారికి జోడిగా మన చందమామ “కాజల్ అగర్వాల్” నటిస్తుంది.

అనుకున్న రేంజ్ లో మన భారతీయుడు-2 మన అందరికి నచ్చాలి “రోబో 2.O” తో నిరాశ పరిచిన శంకర్ గారు ఈ సారి మనల్ని మెప్పిస్తారు అని ఫాన్స్ అందరి తరపున చిన్న కోరిక.