భాస్కరభట్ల తల్లి మృతి


Bhaskarabhatla Ravikumar mother
Bhaskarabhatla Ravikumar mother

ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) అనారోగ్యంతో మృతి చెందింది . కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కరభట్ల తల్లి రాజమండ్రి లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది . ఈ సంఘటన సోమవారం రాత్రి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . నిన్న విజయలక్ష్మి అంత్యక్రియలు కైలాసభూమి లో జరిగాయి .

భాస్కరభట్ల ఈ అంత్యక్రియలను నిర్వహించాడు . విజయలక్ష్మి కి ముగ్గురు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు కాగా భాస్కరభట్ల రవికుమార్ పెద్ద కుమారుడు దాంతో అంత్యక్రియలను భాస్కరభట్ల నిర్వహించాడు . భాస్కరభట్ల తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.