భీష్మ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


భీష్మ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
భీష్మ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నితిన్ నటించిన భీష్మ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాగా అవతరించిన సంగతి తెల్సిందే. ఈ సినిమాకు మొదటి నుండి పాజిటివ్ టాక్ రాగా క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని హిట్ అని తేల్చేసారు. దాంతో భీష్మ మొదటి రోజు కలెక్షన్స్ ను కుమ్మేసింది. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ గా దాదాపు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను, రసాయనాలు వాడడం వల్ల కలిగే నష్టాన్ని ఈ చిత్రంలో కమర్షియల్ పద్దతిలో చూపించారు. ముఖ్యంగా డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. భీష్మ పాత్రలో నితిన్ నటన, కామెడీ టైమింగ్ అద్భుతమనే లెవెల్లోనే ఉంది.

10 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లను మించి సాధించింది. భీష్మకు 26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది చిత్రం. భీష్మ దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఉగాదికి V వచ్చేవరకూ భీష్మకు లాంగ్ రన్ ఉండటం కొంచెం కలిసొచ్చే అంశం. అయితే అన్ సీజన్ లో ఈ చిత్రం విడుదలవ్వడం కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇదే ఏ సంక్రాంతికో, క్రిస్మస్ కో విడుదలై ఉంటె కనీసం మరో 5 కోట్లు ఎక్కువ షేర్ వచ్చేదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

భీష్మ 10 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం: Rs 8.57 Cr
సీడెడ్: Rs 3.13 Cr
ఉత్తరాంధ్ర: Rs 2.86 Cr
ఈస్ట్: Rs 1.64 Cr
వెస్ట్: Rs 1.21 Cr
గుంటూరు: Rs 1.73 Cr
కృష్ణ: Rs 1.44 Cr
నెల్లూరు: Rs 72 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ:  Rs 21.30 Cr షేర్స్
రెస్ట్ ఆఫ్ ఇండియా: Rs 1.88 Cr
ఓవర్సీస్: Rs 3.10 Cr
వరల్డ్ వైడ్: Rs 26.28 Cr షేర్స్