భీష్మ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Bheeshma 2 days collections report
Bheeshma 2 days collections report

నితిన్ నటించిన భీష్మ సినిమా తొలి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఇక సినిమా కూడా బాగుందని తేలడంతో భీష్మకు ఎదురులేకుండా పోయింది. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల తర్వాత ఆకట్టుకునే సినిమా రాకపోవడం కూడా భీష్మకు కూడా ప్లస్ అయింది. ఈ సినిమా తొలి రోజు సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ను నమోదు చేయగా, రెండో రోజు కూడా ఎక్కడా తగ్గలేదు. మొదటి రోజు 6.7 కోట్ల షేర్ ను సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా 4.5 కోట్ల షేర్ ను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో రెండు రోజులకే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం విశేషం. ఇక ఈరోజు ఆదివారం కావడంతో భీష్మ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశముంది.

భీష్మ సినిమా కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 4.19 కోట్లు
సీడెడ్ : 1.4 కోట్లు
గుంటూరు : 1.26 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.2 కోట్లు
తూర్పు గోదావరి : 92 లక్షలు
పశ్చిమ గోదావరి : 71 లక్షలు
కృష్ణ : 68 లక్షలు
నెల్లూరు : 37 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 10.73 కోట్లు

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, రఘుబాబు, నరేష్, అనంత్ నాగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.

తొలి సినిమా ఛలోతోనే అందరినీ మెప్పించిన వెంకీ కుడుముల రెండో సినిమాతో కూడా తన స్టామినాను నిరూపించాడు. కథ రొటీన్ గానే ఉన్నా తనదైన శైలి ట్రీట్మెంట్ తో ఎంటర్టైనింగ్ సన్నివేశాలతో భీష్మాను తీర్చిదిద్దాడు. అదే సినిమాకు మెయిన్ ప్లస్ గా నిలిచింది. మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.