భీష్మ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


భీష్మ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
భీష్మ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా భీష్మ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి అంటే ఆఫ్ సీజన్ ఉంటుంది కానీ భీష్మ మాత్రం ఇదే సీజన్ లో దుమ్ము రేపుతోంది. తొలి నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఫస్ట్ డే ఆరు కోట్ల పైచిలుకు షేర్ తో భీష్మ అదరగొట్టింది. ఇక అక్కడినుండి ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ వీకెండ్ దాదాపు 15 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం, సోమవారం కూడా 1.7 కోట్ల షేర్ ను రాబట్టగలిగింది.

సాధారణంగా వీక్ డే మొదలయ్యే సోమవారం వసూళ్ళలో బాగా డ్రాప్ ఉంటుంది కానీ భీష్మ మాత్రం స్ట్రాంగ్ గానే నిలిచింది. భీష్మకు 23 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే 25 కోట్లు వస్తే సినిమాను సూపర్ హిట్ గా పరిగణించవచ్చు. అయితే ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే భీష్మ మొదటి వారంలోనే సేఫ్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ద్వారా బయ్యర్లు హ్యాపీగా ఉండనున్నారు. దాదాపు 10 కోట్ల మేరకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భీష్మ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం – 6.64 కోట్లు
సీడెడ్ – 2.55 కోట్లు
గుంటూరు – 1.51 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.13 కోట్లు
తూర్పు గోదావరి – 1.32 కోట్లు
పశ్చిమ గోదావరి – 97.5 లక్షలు
కృష్ణా – 1.05 లక్షలు
నెల్లూరు – 54 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ – 16.71 కోట్లు

వరల్డ్ వైడ్ – 21.13 కోట్లు

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచిన ఈ చిత్రంలో సంపత్ రాజ్, అనంత్ నాగ్ కీలక పాత్రలు పోషించారు. మహతి సాగర్ సంగీతాన్ని అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించాడు.