భీష్మ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్


భీష్మ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్
భీష్మ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్

నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా భీష్మ తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా మీద మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉండగా తొలిరోజు కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. నితిన్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. తొలి వీకెండ్ దాకా అదే జోరు చూపించిన భీష్మ, వీక్ డేస్ మొదలయ్యే నాటికి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. సోమవారం, మంగళవారం కలెక్షన్స్ ఓ మోస్తరుగా డ్రాప్ అయినా బుధ, గురువారాలు కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఫిబ్రవరి ఆఫ్ సీజన్ కావడంతో ఈ డ్రాప్ ఊహించదగిందే.

అయితే భీష్మకు ఉగాది దాకా ఎదురులేకపోవడం కలిసొచ్చే అంశం. నాని నటించిన V విడుదలయ్యేవరకూ భీష్మను ఎఫెక్ట్ చేసే రేంజ్ లో సినిమా ఏదీ విడుదల కావట్లేదు. సో, నితిన్ కు భారీ హిట్ అందుకోవడం పెద్ద కష్టమేం కాకపోదు. అయితే ఇప్పటికే భీష్మ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. బయ్యర్లు అందరూ ఈ చిత్రం ద్వారా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆరు రోజులకు గాను ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 23 కోట్లకు పైన విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 19 కోట్లను వసూలు చేసింది. యూఎస్ లో భీష్మ 1 మిలియన్ డాలర్స్ వైపు అడుగులు వేస్తుండడం కొసమెరుపు.

భీష్మ 6 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం : Rs 7.65 Cr
సీడెడ్ : Rs  2.79 Cr
ఉత్తరాంధ్ర : Rs 2.48 Cr
ఈస్ట్ : Rs 1.45 Cr
వెస్ట్ : Rs 1.07 Cr
గుంటూరు : Rs 1.52 Cr
కృష్ణ : Rs 1.19 Cr
నెల్లూరు : Rs 59 Lakhs
ఆంధ్ర + తెలంగాణ :  Rs 18.74 Cr షేర్
వరల్డ్ వైడ్ : 23.16 Cr షేర్