భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్


భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ తొలిరోజు నుండి సూపర్బ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా ప్రామిసింగ్ గా మొదటి రోజు నుండి ఉన్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఆరు కోట్ల పైనా వసూలు చేయగా ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికే 15 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఇంప్రెస్ చేసింది. అయితే అన్ సీజన్ కావడంతో భీష్మ కలెక్షన్స్ వీక్ డేస్ లో బాగా నెమ్మదించాయి. అయినా కానీ ఫస్ట్ వీల్ ముగిసేసరికి ఓవరాల్ గా భీష్మ సేఫ్ వెంచర్ అయింది. అయితే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ అవ్వగా, ఇంకొన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని 22.5 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 24 కోట్లకు దగ్గరగా వసూలు చేసింది.

ఇక రేపటి నుండి ఈ చిత్రానికి సెకండ్ వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఉగాది వరకూ భీష్మకు లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నాని నటించే V విడుదలయ్యేవరకూ భీష్మను ఇబ్బంది పెట్టే సినిమా రాబోవట్లేదు. సో భీష్మ ఫైనల్ రన్ ఇంకెంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం: 7.52 cr
సీడెడ్: 2.86 cr
ఉత్తరాంధ్ర: 2.57 cr
కృష్ణ: 1.35 cr
గుంటూరు: 1.53 cr
ఈస్ట్: 1.44 cr
వెస్ట్: 1.18 cr
నెల్లూరు: 0.62 cr

ఎపీ+తెలంగాణా: 19.07 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 1.78 cr
ఓవర్సీస్: 3.00 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 23.85 cr

వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అనంత్ నాగ్, సంపత్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్ రోల్ ఈ సినిమాలో హైలైట్ గా మారింది.