భీష్మ క్యాప్షన్ కు కథకు సంబంధం లేదుగా!


భీష్మ క్యాప్షన్ కు కథకు సంబంధం లేదుగా!
భీష్మ క్యాప్షన్ కు కథకు సంబంధం లేదుగా!

నితిన్ హీరోగా వచ్చిన భీష్మ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే దిశగా పయనిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 10 కోట్ల షేర్ కు పైగా సాధించింది. అది కూడా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపిన మొత్తం మాత్రమే. యూఎస్ లో కూడా ఈ సినిమా హవా సాగుతోంది. కేవలం శనివారం ఒక్కరోజే ఈ చిత్రం పాతిక మిలియన్ డాలర్లు సాధించి హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. ఫుల్ రన్ లో 1 మిలియన్ డాలర్ ను ఈజీగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ…ఆ ఇప్పటిదాకా నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. కానీ ఇప్పుడు భీష్మ దాని స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది. రోజురోజుకీ బలపడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి అన్ సీజన్ అయినా కూడా ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ను ఊహించలేదు మేకర్స్.

ఈ సినిమా హిట్ సంగతి పక్కనపెడితే ఈ సినిమాకు పెట్టిన భీష్మ టైటిల్ కు క్యాప్షన్ సింగిల్ ఫరెవర్ గురించి ఇప్పుడు ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది. టైటిల్ కు క్యాప్షన్ కు సంబంధం ఉండకుండా కొంత మంది టైటిల్స్ పెడతారు. ఇంకొంత మంది క్యాప్షన్ ను కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పెడుతుంటారు. భీష్మ రెండో కేటగిరీకి చెందే చిత్రం. సింగిల్ ఫరెవర్ అనగానే కచ్చితంగా యూత్ అట్ట్రాక్ట్ అయిపోతారు. ఇక సినిమా కథ విషయానికి వచ్చేసరికి సినిమా మొదట్లో నితిన్ సింగిల్ గా కనిపిస్తాడు కానీ హీరోయిన్ ను త్వరగానే పడేస్తాడు. మధ్యలో విడిపోయినట్లు అనిపించినా చివరికి ఒక్కటవుతారన్న విషయం ముందే సంకేతాలిచ్చేస్తారు. ఈ సినిమాకు మెయిన్ థీమ్ రొమాంటిక్ యాంగిల్ కాకుండా ఫక్తు కమర్షియల్ సినిమా తరహాలో సేంద్రీయ వ్యవసాయం గురించి డిస్కషన్, విలన్ తో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. వినోదం మత్తులో ప్రేక్షకులను ఉంచి క్యాప్షన్ కు కంటెంట్ కు సంబంధం లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు.