నాని వచ్చేదాకా భీష్మదే రాజ్యం


నాని వచ్చేదాకా భీష్మదే రాజ్యం
నాని వచ్చేదాకా భీష్మదే రాజ్యం

ఈ ఏడాది టాలీవుడ్ కు మంచి ఆరంభమే లభించింది. సంక్రాంతి పండగకు విడుదలైన రెండు చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండూ కూడా భారీ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు స్టేట్స్ లో దాదాపు 250 కోట్ల షేర్ ను సాధించాయి. అటు యూఎస్ లో కూడా ఈ సినిమాలు 6 మిలియన్ లకు దగ్గరగా వసూలు చేసాయి. అయితే సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ లో వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోయాయి. మధ్యలో వచ్చిన అశ్వద్ధామ కొంచెం బెటర్ సినిమా అనిపించుకుంది కానీ కలెక్షన్స్ మాత్రం బిలో యావరేజ్ గానే నిలిచింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న జాను దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ కూడా విజయ్ ఖాతాలో మరో ప్లాప్ గా నిలిచింది.

ఇలాంటి పరిస్థితిలో వచ్చిన భీష్మ చిత్రం బాక్స్ ఆఫీస్ కు కొత్త కళ తీసుకొచ్చింది. ఈ సినిమాను 25 కోట్లకు బిజినెస్ చేయగా ఫుల్ రన్ లో 10 కోట్ల లాభాలు వచ్చేలా ఉన్నాయి. వారం తిరక్కుండానే ఈ చిత్రం సేఫ్ అయ్యేలా ఉంది. సాధారణంగా ఫిబ్రవరి నుండి మార్చ్ వరకూ టాలీవుడ్ లో ఆఫ్ సీజన్ గా పరిగణిస్తారు. ఈ సీజన్ లోనే భీష్మ సూపర్ సక్సెస్ కావడం, పైగా మరో నెల రోజుల పాటు పెద్ద సినిమాలు వచ్చే ఆస్కారం కాదు.

ఈ నేపథ్యంలో ఉగాదికి నాని నటించిన v విడుదలయ్యే వరకూ తెలుగు ఆడియన్స్ కు భీష్మ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారుతుంది. సో నాని సినిమా వచ్చేవరకూ భీష్మ సినిమాకు ఎంత దంచుకుంటే అంత అన్నట్లుగా మారింది పరిస్థితి.