`భీష్మ‌` తొలి రోజు ఏపీ, టీఎస్ క‌లెక్ష‌న్స్‌!

`భీష్మ‌` తొలి రోజు ఏపీ, టీఎస్ క‌లెక్ష‌న్స్‌!
`భీష్మ‌` తొలి రోజు ఏపీ, టీఎస్ క‌లెక్ష‌న్స్‌!

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన నితిన్ టైమ్ మారింది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బిజినెస్ ప‌రంగా మంచి లాభాల్ని అందించిన ఈ చిత్రం తొలి రోజు హిట్ టాక్‌తో క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషంగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో `భీష్మ‌` తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాలు:
నైజాం : 2.20 కోట్లు
సీడెడ్ : 0. 80 కోట్లు
వైజాగ్ : 0.62 కోట్లు
గుంటూరు: 0. 77 కోట్లు
ఈస్ట్ గోదావ‌రి : 0. 66 కోట్లు
వెస్ట్ గోదావ‌రి : 0. 56 కోట్లు
కృష్ణా : 0.40 కోట్లు
నెల్లూరు : 0. 27 కోట్లు

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూలు చేసిన మొత్తం 6.28 కోట్లు.

వీకెండ్ కాబ‌ట్టి ఈ వ‌సూళ్లు మ‌రింత పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఆర్గానిక్ వ్య‌వ‌సాయం అనే పాయింట్‌కి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని జోడించి ఆద్యంతం వినోదాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.