నితిన్ భీష్మ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్

 

Bheeshma first weekend collections report
Bheeshma first weekend collections report

నితిన్ నటించిన భీష్మ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రాగా కలెక్షన్స్ కూడా కుమ్మేస్తోంది. డొమెస్టిక్ మార్కెట్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా భీష్మ కలెక్షన్స్ దుమ్ము దులుపుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రకమైన సందిగ్దత నెలకొన్న విషయం తెల్సిందే. భీష్మ రాకతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద కళ కనిపిస్తోంది.

మొదటినుండి భీష్మకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. అలాగే సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా రాకపోవడం, భీష్మకున్న బజ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం వంటి కారణాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టింది.

భీష్మ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ :

నైజాం                  –       6.02 కోట్లు

సీడెడ్                   –      2.1  కోట్లు

గుంటూరు            –       1.5 కోట్లు

ఉత్తరాంధ్ర           –       1.8 కోట్లు

తూర్పు గోదావరి   –        1.2  కోట్లు

పశ్చిమ గోదావరి   –         88.5 లక్షలు

కృష్ణ                    –        99 లక్షలు

నెల్లూరు               –        48 లక్షలు

భీష్మ ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్  – 14.97 కోట్లు

ఇండియా మొత్తం – 1.65  కోట్లు

ఓవర్సీస్ – 2.33  కోట్లు

వరల్డ్ వైడ్ భీష్మ ఫస్ట్ వీక్ షేర్ – 18.95 కోట్లు

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.