భీష్మ నుంచి వాటే బ్యూటీ వ‌చ్చేస్తోంది!భీష్మ నుంచి వాటే బ్యూటీ వ‌చ్చేస్తోంది!
భీష్మ నుంచి వాటే బ్యూటీ వ‌చ్చేస్తోంది!

వ‌రుస ఫ్లాపుల త‌రువాత నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, పెళ్లి, అమ్మాయిలు అంటేనే ప‌డ‌ని ఓ యువ‌కుడిగా నితిన్ ఇండులో న‌టిస్తున్నారు. క్రేజీ హీరోయిన్‌ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

భీష్మ అనే ఓ బ‌యో ఫామ్‌లో వ‌ర్క్ చేసే వ‌య‌కుడిగా నితిన్ ఇందులో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. క‌న్న‌డ న‌టుడు అనంత్ నాగ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా ఫుల్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న‌ట్టు టీజ‌ర్‌తోనే ద‌ర్శ‌కుడు హింట్ ఇచ్చేశాడు. ఇటీవ‌లే ఈ చిత్రంలోని బ్యాచ్‌ల‌ర్స్ అంథెమ్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం మ‌రో పాట‌ని రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతోంది.

`వాటే బ్యూటీ..` పేరుతో ఈ నెల 31న ఓ మెస్మ‌రైజింగ్ సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ పాట‌ని ప్ర‌త్యేకంగా ర‌ష్మిక కోస‌మే రాయించిన‌ట్టుందని తెలుస్తోంది. ఆమె బ్యూటీని వ‌ర్ణిస్తూ హీరో నితిన్ పాడే ఈ పాట సినిమాలో హైలైట్ గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. హెబ్బాప‌టేల్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ చేస్తున్నారు.