భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్


భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన లాస్ట్ 3 సినిమాలు ప్లాపులుగా మిగలడంతో నితిన్ ఈసారి హిట్ కొట్టడం తప్పనిసరి. అయితే భీష్మ సినిమాతో నితిన్ ఆ హిట్ ను అందుకునేలానే ఉన్నాడు. ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ చాలా ప్రామిసింగ్ గా ఉండడంతో హిట్ కళ కనిపిస్తోంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదలవుతుండగా సినిమాపై బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి.

ఇక భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ చిత్ర బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే పెరిగిందన్న వార్తలు ఆ మధ్య బాగా వచ్చాయి. అయితే సినిమాపై పాజిటివ్ బజ్ నేపథ్యంలో చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. విడుదలకు ముందే నిర్మాత దాదాపు 10 కోట్ల మేర లాభాల్ని చూసాడు. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే భీష్మ దాదాపు 23.5 కోట్లు ఆర్జించింది. అంటే ఈ సినిమా 24 కోట్లకు పైన వసూలు చేస్తేనే హిట్ అని పరిగణించగలం. బయ్యర్లు అందరూ సేఫ్ గా ఉండేది.

భీష్మ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ డౌన్:

నైజాం : Rs 6.30 Cr

సీడెడ్ : Rs 3.06 Cr

ఉత్తరాంధ్ర : Rs 1.85 Cr

గుంటూరు :Rs 1.55 Cr

ఈస్ట్ గోదావరి : Rs 1.55 Cr

కృష్ణ : Rs 1.40 Cr

వెస్ట్ గోదావరి : Rs 1.20 Cr

నెల్లూరు : Rs 0.64 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 17.50 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 2 Cr

ఓవర్సీస్ : Rs 2.40 Cr

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ : Rs 23.50 Cr

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. మహతి సాగర్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. మరి భీష్మతో నితిన్ హిట్ అందుకోగలడో లేదో తెలియాలంటే రేపటి వరకూ ఎదురుచూడక తప్పదు.