ట్రైల‌ర్ టాక్‌: నితిన్‌కి హిట్టు గ్యారెంటీలా వుందే!


ట్రైల‌ర్ టాక్‌: నితిన్‌కి హిట్టు గ్యారెంటీలా వుందే!
ట్రైల‌ర్ టాక్‌: నితిన్‌కి హిట్టు గ్యారెంటీలా వుందే!

వ‌రుస మూడు ఫ్లాపుల త‌రువాత నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. క్రేజీ గాళ్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్గానిక్ ఫామింగ్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ నెల 21న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. సోమ‌వారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌తో హిట్ అనే సంకేతాల్ని అందించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌లోని స‌న్నివేశాలు చూస్తుంటే నితిన్ హిట్ కాదు బ్లాక్ బ‌స్ట‌ర్‌ని కొట్టేలా వున్నాడు. టీజ‌ర్‌లో కామెడీని మాత్ర‌మే చూపించి అస‌లు క‌థ‌ని దాచారు. అయితే ట్రైల‌ర్‌లో అస‌లు క‌థ‌ని రివీల్ చేసేయ‌డం, తొలి స‌న్నివేశాల్లో రోమియోగా నితిన్ క‌నిపిస్తున్న తీరు. ట్రైల‌ర్ మిడ్‌కు వ‌చ్చేస‌రికి ఆర్గానిక్ ఫామింగ్‌ని ఓ మిష‌న్‌లా హీరో ముందుకు తీసుకెళుతున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆర్గానిక్ ఫామింగ్‌. దాని వెన‌కున్న వెత‌లు, కుట్ర‌ల్ని ఇందులో చూపించిన తీరు బాగుంది. నితిన్ సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తూ సేంద్రియ సేద్యం చేస్తుంటే విల‌న్ మాత్రం ర‌సాయ‌నాల‌తో త్వ‌ర త్వ‌ర‌గా పంట‌ల‌ని చేజిక్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.. ఈ క్ర‌మంలో జ‌రిగిన వార్‌లో ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడాల‌న్న నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. సీరియ‌స్ క‌థ‌ని త‌న‌దైన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి వెంకీ కుడుముల తెర‌కెక్కించిన తీరు నితిన్‌కి ఈ సారి పక్కా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించేలా క‌నిపిస్తోంది.