పవన్ ను మరోసారి ఫాలో అవుతున్న నితిన్.. భీష్మలో నడుము యాంగిల్


పవన్ ను మరోసారి ఫాలో అవుతున్న నితిన్.. భీష్మలో నడుము యాంగిల్
పవన్ ను మరోసారి ఫాలో అవుతున్న నితిన్.. భీష్మలో నడుము యాంగిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ హిట్ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఖుషీ. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటికే పవన్ పేరున్న హీరో అయినా కూడా ఖుషీ తర్వాత టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. ఆ దశాబ్దం విడుదలైన బెస్ట్ హిట్స్ లో ఖుషీ ఒకటిగా నిలిచింది. ఖుషీ సినిమా అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ఇంటర్వెల్ ముందు వచ్చే నడుము సీన్. పవన్ కళ్యాణ్, భూమిక ఒక చోట కూర్చుని చదువుకుంటుంటే గాలి రావడం, దానికి భూమిక చీర పక్కకి జరగడం.. పవన్, భూమిక నడుమును పదే పదే చూడటం జరిగిపోతాయి. ఆ తర్వాత భూమిక ఎందుకు నా నడుము చూసావ్ అన్న ప్రశ్న దగ్గరనుండి కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి నెగటివ్ పాయింట్స్ ను ఒకరు ఎత్తి చూపించుకోవడంతో ఇగో సమస్యలు మొదలై ఇద్దరూ విడిపోతారు. ఖుషీ సినిమాకు ఈ సీన్ ఆయువుపట్టు వంటిది. ఇప్పుడు ఈ సీన్ గురించి ఇంతలా డిస్కషన్ ఎందుకంటే ఇలాంటి సీనే మరోసారి రిపీట్ కాబోతోంది.

నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మలో ఇలాంటి సీన్ ఉంది. ఒక ఆఫీస్ సెటప్ లో ముందు హీరోయిన్ రష్మిక నడుస్తుంటే వెనక నితిన్ రష్మిక నడుమును చూస్తూ దాన్ని పట్టుకుందామని ఫాలో అవుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రష్మిక వెనక్కి తిరగడం, నితిన్ ఆమె నడుమును పట్టేసుకోవడం, రష్మీక ఏంటి అన్నట్లుగా చూస్తే నితిన్ ఏం లేదన్నట్లుగా సైగ చేయడం.. ఇలా సరదాగా సాగే టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ టీజర్ లో ఫోకస్ అంతా రష్మిక నడుముపైనే. ఇప్పటికే నితిన్ ఒకసారి గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో నడుము సీన్ ను వాడేసుకున్నాడు. మరోసారి భీష్మ కోసం ఇదే పని చేస్తున్నాడు. ఈ సీన్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాడు నితిన్. హీరో, హీరోయిన్ మధ్య నడిచే కెమిస్ట్రీ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ అని అంటున్నారు. పవన్, భూమిక మధ్య ఖుషీలో నడిచిన కెమిస్ట్రీ రేంజ్ లో భీష్మలో కూడా సన్నివేశాలు నడుస్తాయట.

ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ కుడుముల రెండో ప్రయత్నంగా భీష్మ తీస్తున్నాడు. ఫరెవర్ సింగిల్ అనే క్యాప్షన్ తో భీష్మ వస్తోంది. వెంకీ మొదటి సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా రొమాంటిక్, కామెడీ ప్రధానంగా సాగుతుందట. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నా ఇప్పుడు భీష్మను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టీజర్ లో ఆకట్టుకున్న మరో అంశం మ్యూజిక్. ఛలో సినిమాలో చూసి చూడంగానే అంటూ సూపర్ హిట్ సాంగ్ అందించిన మణిశర్మ తనయుడు మహతి సాగర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. భీష్మ చిత్రంతో నితిన్ మరో విజయం అందుకుంటాడేమో చూడాలి.