యూఎస్ ఆడియన్స్ అభిరుచులు మారాయా?


యూఎస్ ఆడియన్స్ అభిరుచులు మారాయా?
యూఎస్ ఆడియన్స్ అభిరుచులు మారాయా?

ఎంత కాదనుకున్నా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అభిరుచికి యూఎస్ లో తెలుగు ప్రజల అభిరుచికి చాలా తేడా ఉంటుంది. యూఎస్ లో తెలుగు వాళ్ళు క్లాస్ కథలంటే పడి చస్తారు. ఇక్కడ కలెక్షన్స్ కొంచెం డల్ గా ఉన్నా కానీ యూఎస్ లో మాత్రం మిలియన్ డాలర్ ను అందిస్తారు. అయితే చూస్తుంటే నెమ్మదిగా వాళ్ళ అభిరుచులలో కూడా మార్పు వచ్చినట్లుగా అనిపిస్తోంది. కొంచెం రొటీన్ ఉన్నా పెద్దగా ఆదరించడానికి ఇష్టపడని అక్కడి వారు కథలో కొత్తదనం లేకపోయినా సంక్రాంతి సినిమాలకు ఓటు వేశారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. ఈ రెండు చిత్రాలు కలిపి అక్కడ 6 మిలియన్ డాలర్ పైన వసూళ్లు సాధించాయి. కథ గురించి పట్టించుకోకుండా తమను ఎంత మేర ఎంటర్టైన్ చేసారని మాత్రమే చూసారు.

ఇదిలా ఉంటే ఈ నెల మొదట్లో విడుదలైన జాను చిత్రం మాత్రం యూఎస్ బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్యూర్ క్లాస్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాను యూఎస్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని అందరూ నమ్మారు. అలాగే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో డొమెస్టిక్ మార్కెట్ సంగతెలా ఉన్నా యూఎస్ లో మాత్రం సినిమా బాగా ఆడుతుందని నమ్మారు. కానీ విచిత్రంగా జాను అక్కడ భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమాను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. కేవలం రిలీజ్ ఖర్చుల వరకూ వచ్చి అక్కడి నిర్మాత భారీగా నష్టపోయాడు. అలాగే మరో ప్రేమ కథ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా అక్కడ ఫెయిల్యూర్ గానే నిలిచింది.

ఇక లేటెస్ట్ గా విడుదలైన భీష్మ మరోసారి రొటీన్ కథతోనే వచ్చింది. అయితే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ఫఫుల్ అనిపించుకుంది. దీంతో ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. శనివారంతోనే హాఫ్ మిలియన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.