యాక్సిడెంట్ లో చనిపోయిన హీరోయిన్


bhojpuri actress manisha rai killed in road accident

రోడ్ యాక్సిడెంట్ లో ఎంతో భవిష్యత్ ఉన్న హీరోయిన్ అర్దాంతరంగా తన తనువు చాలించింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది . భోజ్ పురి లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ” మనీషా రాయ్ ” బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుండి ఓ కారు వేగంగా గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయింది మనీషా రాయ్ . ఈ యాక్సిడెంట్ చిట్టోవ్ని గ్రామం వద్ద జరిగింది . మనీషా రాయ్ పలు షార్ట్ ఫిలిం లలో అలాగే సీరియల్ లలో కూడా నటించింది . భోజ్ పురి సినిమాలలో కూడా నటించింది .

ఎంతో మంచి భవిష్యత్ ఉందని అనుకుంటున్న సమయంలో ఇలా దుస్సంఘటన జరగడంతో భోజ్ పురి చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది . సహా నటుడు సంజీవ్ మిశ్రా తో కలిసి బైక్ మీద వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరుగగా సంజీవ్ మిశ్రా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు కానీ మనీషా రాయ్ మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళింది .