ఇక్కడ భాగమతి – అక్కడ దుర్గావతి


ఇక్కడ భాగమతి – అక్కడ దుర్గావతి
ఇక్కడ భాగమతి – అక్కడ దుర్గావతి

“ఎవడు పడితే వాడు రాడానికి… ఎప్పుడు పడితే అప్పుడు పోడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.? భాగమతి అడ్డా.! లెక్కలు తేలేవరకూ ఎవడినీ పోనివ్వను.” అంటూ వెండితెరపై అనుష్క చేసిన మ్యాజిక్ భాగమతి సినిమా. అనుష్క నటనకు అశోక్ సార్ స్క్రీన్ ప్లే కలిసి ఈ సినిమాను పెద్ద హిట్ చేసాయి. ఇప్పుడు ఈ సినిమాను “దుర్గావతి” పేరుతో హిందీలో నిర్మిస్తున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన అశోక్ సార్ హిందీలో కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోపాటు భూషణ్ కుమార్ సమర్పణలో వివేక్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

ఇక టైటిల్ రోల్ లో బాలీవుడ్ విలక్షణ నటి భూమి ఫెడ్నేకర్ నటిస్తున్నారు. భూమి గురించి చెప్పాలంటే ఆమె 130 కేజీల బరువుతో కనిపించిన “దమ్ లగాహై సా” తోపాటు బాలీవుడ్ ని తన బోల్డ్ కంటెంట్ తో షేక్ చేసిన “లస్ట్ స్టోరీస్” వెబ్ సీరీస్ లు గుర్తుకువస్తాయి. కేవలం అందాల ప్రదర్శనకే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే భూమి ఈ సినిమాలో “చంచల” పాత్రకు వంద శాతం న్యాయం చెయ్యగలదు అని బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక హీరోయిన్ భూమి తమ సినిమాను దుర్గా పూజతో మొదలుపెట్టారు. “దుర్గామాత ఆసీసులతో సినిమా మొదలైంది. నేను సిద్దంగా ఉన్నాను అక్షయ్ సర్” అంటూ భూమి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే కంగనా,దీపిక మాదిరిగా భూమి ఫెడ్నేకర్ కూడా సోలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం ఖాయం.