లేటు వయసులో ఘాటు అందాలను ప్రదర్శిస్తున్న ఫ్యామిలీ బ్యూటీ


లేటు వయసులో ఘాటు అందాలను ప్రదర్శిస్తున్న ఫ్యామిలీ బ్యూటీ
లేటు వయసులో ఘాటు అందాలను ప్రదర్శిస్తున్న ఫ్యామిలీ బ్యూటీ

హీరోయిన్ గా చేసినంత కాలం ఫ్యామిలీ టైప్ పాత్రలతో పద్దతిగా కనిపించిన భూమిక చావ్లా ఇప్పుడు గ్లామరసాన్ని ఒలకపోస్తూ హొయలు పోతోంది. భూమిక తెలుగులో మంచి హిట్లే అందుకుంది. పైగా ఏ హీరోయిన్ కి లేని ఒక రికార్డు భూమిక సొంతం కావడం విశేషం.ఎన్టీఆర్ తో సింహాద్రి, మహేష్ బాబు తో ఒక్కడు, పవన్ కళ్యాణ్ తో ఖుషీ.. ఇలా ఈ ముగ్గురు టాప్ స్టార్స్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ లో భూమిక హీరోయిన్ కావడం విశేషం. ఈ ముగ్గురూ హీరోలకు ఆ సమయానికి అదే అతిపెద్ద బ్లాక్ బస్టర్. పైగా ఈ ముగ్గురికి అదే 7వ సినిమా కావడం విశేషం. ఇలా అరుదైన రికార్డుతో భూమిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే చిరంజీవి వంటి టాప్ స్టార్ తోనూ భూమిక నటించింది. ఇలా కెరీర్ లో మంచి హిట్సే అందుకున్న భూమిక నెమ్మదిగా హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయింది. అయితే మళ్ళీ త్వరగానే క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులేసింది భూమిక. ఇంకా అమ్మ పాత్రల వరకూ రాలేదు కానీ వదిన పాత్రలకు ప్రస్తుతం భూమికనే మొదట సంప్రదిస్తున్నారు. కొంత కాలం క్రితం నాని ఎంసీఏ సినిమాలో నానికి వదిన పాత్రలో మెరిసింది. అలాగే సవ్యసాచిలో కూడా నాగ చైతన్యకు వదిన పాత్రలో మెప్పించింది. యూ టర్న్ లో కూడా కీలకమైన పాత్రను పోషించింది.

ఇలా ఈ జనరేషన్ లో కూడా భూమిక టచ్ లోనే ఉంది. ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె రోల్ ఎలాంటిదన్న విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. రూలర్ డిసెంబర్ 20న విడుదలవుతుంది. అలాగే తమిళంలో కన్నై నంబాదే అనే చిత్రంలో భూమిక నటిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో కూడా భూమిక యాక్టివ్ గానే ఉంటోంది. కెరీర్ లో ఎక్కువగా ట్రెడిషనల్ గా కనిపించడానికి ఇష్టపడిన భూమిక, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేస్తోంది.

రీసెంట్ గా భూమిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేసి దానికి 2009 అనే క్యాప్షన్ ను జత చేసింది. అంటే ఈ ఫోటో 2009లో దిగింది అనుకోవాలా? అది అర్ధం కాలేదు కానీ భూమిక ఈ ఫొటోలో స్టన్నింగ్ గా ఉంది. బ్లాక్ కలర్ బులెట్ పై అమ్మడు పడుకుని ఉండడం, దానికి మ్యాచింగ్ గా బ్లాక్ కలర్ షర్ట్, షార్ట్ ధరించింది. పైన షర్ట్ బటన్స్ వదిలేయడమే ఈ ఫొటోలో హైలైట్. పైగా షేడ్స్ కూడా పెట్టుకోవడంతో మంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుంది. నలభైలలో పడిన భూమిక ఇప్పుడెందుకు ఇలా గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడుతోంది. అదేదో హీరోయిన్ గా ఉన్నప్పుడే చేస్తే మరిన్ని అవకాశాలు వచ్చేవి కదా అంటూ కామెంట్స్ పడుతున్నాయి. అంతే కాకుండా ఈ ఫొటోకు మైండ్ బ్లోయింగ్, సూపర్, బిందాస్ అంటూ మెచ్చుకుంటున్న వారు కూడా ఉన్నారు.

 

View this post on Instagram

 

2009 . ….

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on

Credit: Instagram