డైవ‌ర్స్ రూమ‌ర్‌ల‌కు భూమిక స్పార్ట్ రిప్లై


డైవ‌ర్స్ రూమ‌ర్‌ల‌కు భూమిక స్పార్ట్ రిప్లై
డైవ‌ర్స్ రూమ‌ర్‌ల‌కు భూమిక స్పార్ట్ రిప్లై

జీ టీవీ సిరీస్ `హిప్ హిప్ హుర్రే`తో భూమిక న‌టిగా త‌న కెరీర్‌ని ప్రారంభించింది. ఆ త‌రువాత వెండితెర‌పై `యువ‌కుడు` మూవీతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. క్రేజీ హీరోయిన్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకుంది. తెలుగులో స్టార్ హీరోల‌తో క‌లిసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌లో న‌టించి స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది.

కొంత వ‌రామం త‌రువాత నాని న‌టించిన `ఎంసీఏ` సినిమాతో మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుతం తెలుగులో భూమిక చేతిలో వున్న చిత్రం `సీటీమార్‌`. ఇదిలా వుంటే భూమిక త‌న భ‌ర్త భ‌ర‌త్ టాకూర్‌తో విడిపోయింద‌ని, విడాకులు తీసుకుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై భూమిక స్పందించ‌లేదు. క్లారిటీ ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌లేదు.

తాజాగా మ్యారేజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా తాము విడిపోలేద‌ని, క‌లిసే వున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. భ‌ర్త భ‌ర‌త్ టాకూర్‌తో న‌వ్వులు చిందిస్తున్న ఫొటోని షేర్ చేసింది. దీనికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని జ‌త‌చేసింది. వెయ్యిమైళ్ల దూర‌మైనా చిన్న అడుగుతోనే మొద‌ల‌వుతుంది. ప్రేమ కూడా అంతే. ఈ ప్ర‌యాణంలో ప్రేమ‌ని పొంద‌డం, నేర్చుకోవ‌డం ఒక‌రిని ఒక‌రు తెలుసుకోవ‌డం.. అవ‌గాహ‌న పెంచుకోవ‌డం అనేది ఓ అంద‌మైన ఆనంద‌క‌ర‌మైన ప్ర‌యాణం. ఆ దేవుడు మ‌మ్మ‌ల్ని మా ప్ర‌యాణాన్ని ఆశీర్వ‌దించాలి అంటూ త‌న భ‌ర్త‌కు మ్యారేజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.