పోలీస్ గా మారిన బిచ్చగాడు


విజయ్ ఆంటోనీ బిచ్చగాడు చిత్రంతో సంచలన విజయం సాధించి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు , దాంతో ఆ సినిమా తర్వాత నుండి వరుసగా అతడి సినిమాలు తెలుగులో కూడా నేరుగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి . తాజాగా పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు . నిన్ననే చెన్నై లో ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం జరిగింది . గణేశా అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు విజయ్ ఆంటోనీ . ఇక ఈ సినిమాకు తమిళ్ పేరు ఏంటో తెలుసా ….. ” తిమిరుపుడిచవన్ ”.

హీరోగా నటించడమే కాకుండా సంగీతం కూడా తానే అందిస్తున్నాడు , అయితే ఈ కథ అయిదేళ్ల క్రితమే విజయ్ ఆంటోనీ కి చెప్పాడట గణేశా కానీ అప్పటికి విజయ్ ఆంటోనీ కి హీరోగా అంతగా పేరు లేదు దాంతో ఈ సినిమాని చేయడానికి ముందుకు రాలేదు కట్ చేస్తే బిచ్చగాడు తో స్టార్ అయిపోయాడు అందుకే పవర్ ఫుల్ పోలీస్ గా నటించడానికి ముందుకు వచ్చాడట . ఈ చిత్రంతో సరికొత్త పోలీస్ ని చూడటం ఖాయమని అంటున్నాడు చూద్దాం రిలీజ్ అయ్యాక కానీ తెలీదు .