మరోసారి తన పెద్దమనసు చాటుకున్న బిగ్ బిమరోసారి తన పెద్దమనసు చాటుకున్న బిగ్ బి
మరోసారి తన పెద్దమనసు చాటుకున్న బిగ్ బి

సినిమా రంగంలో నటీనటులు సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా ఇద్దరు కావాల్సి వస్తుంది. వారిలో ఒకరు మేకప్ ఆర్టిస్ట్ అయితే, మరొకరు మేనేజర్ మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్ మనల్ని రకరకాల గెటప్లలో అందంగా చూపిస్తారు. మేనేజర్ బయట మనకున్న రిలేషన్స్ మేనేజ్ చేస్తూ మనకు మంచి సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తారు. చాలామంది నటీనటులు సక్సెస్ అవ్వడానికి వెనకాల వారి యొక్క మేకప్ టీం, పి.ఆర్ టీమ్ ప్రధాన పాత్ర పోషిస్తారు.ఉదాహరణకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఎక్కువశాతం పీతాంబరం గారే మేకప్ చేసేవారు.తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి తనకు మేకప్ చేస్తున్న వ్యక్తికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చి ఆనందపరిచారు. దీపక్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అమితాబచ్చన్ గారికి మేకప్ మేన్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆయనకు తన భార్యతో కలిసి అంకూర్ అనే సంస్థ పేరుతో మేకప్ పార్లర్ ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్లర్ 40 వ వార్షికోత్సవం నిర్వహించారు. అయితే ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమితాబచ్చన్ గారు హాజరై ట్విట్టర్ వేదికగా మేకప్ మీ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసారు.

“దీపక్…47 సంవత్సరాలుగా నా మేకప్ మాన్ నా దగ్గర పని చేస్తూ ఒక గది తీసుకొని తన భార్యతో ఒక పార్లర్ పెట్టించారు. ఇప్పుడు ఆ సంస్థ మూడంతస్తుల భవనంలో, 40 మంది ఉద్యోగులతో నిర్వహించబడుతోంది. ఇప్పుడు ఆ పార్లర్ కి 40 ఏళ్ళు. తను ఇన్నేళ్ళలో ఒక్కరోజు కూడా నాకు మేకప్ చెయ్యకుండా సెలవు తీసుకోలేదు..” అని ఉద్వేగంగా బిగ్ బి వెల్లడించారు. కేవలం మేకప్ మాన్ మాత్రమే కాదు తన దగ్గర పనిచేసే అన్ని రకాల సహోద్యోగులకు అమితాబచ్చన్ గారు మరియు ఆయన కుటుంబం సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. ఈ విషయాన్ని అనేక మంది అనేక సందర్భాల్లో వెల్లడించారు.

Credit: Twitter