బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో క‌రోనా క‌ల‌క‌లం!


బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో క‌రోనా క‌ల‌క‌లం!
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో క‌రోనా క‌ల‌క‌లం!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కానున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సీజ‌న్ 4 కోసం నాలుగు ప్రోమోల‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసి అంచ‌నాలు పెంచేశారు. అయితే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా మాత్రం ఈ సీజ‌న్‌కి విల‌న్‌గా మారుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 4 కోసం ఇప్ప‌టికే కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేసి పార్క్ హ‌య‌త్‌లో వుంచిన నిర్వాహ‌కుల‌కు తాజాగా భారీ షాక్ త‌గిలింది. ఈ సీజ‌న్ కోసం ఎంపిక చేసిన వాళ్లలో ముగ్గురికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 6న ప్రారంభం కానుందంటూ ఇప్ప‌టికే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో ముగ్గురు కంటెస్టెంట్‌ల‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ‌, ఓ సింగ‌ర్‌తో పాటు ఓ డ్యాన్సర్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీంతో బిగ్‌బాస్ సీజ‌న్ 4పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.

గ‌త కొన్ని రోజులుగా `మై విలేజ్ షో` ఫేమ్ గంగ‌వ్వ బిగ్‌బాస్ షోలో పాల్గొన‌బోతోందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే ఆల్‌మోస్ట్ షో ఇక మొద‌లు కాబోయే వారం రోజుల ముందే గంగ‌వ్వ‌కు క‌రోనా అంటూ వార్త‌లు బ‌య‌టికి రావ‌డంతో ఈ అంశం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై బిగ్‌బాస్ మేక‌ర్స్ మాత్రం ఇప్ప‌టికీ క్లారిటీ ఇవ్వ‌డం లేదు.