నాగార్జున గారు గతంలో `బిగ్బాస్`పై చేసిన వ్యాఖ్యలు


Nagarjuna
Nagarjuna

నాగార్జున గారు గతంలో `బిగ్బాస్`పై చేసిన వ్యాఖ్యలు. నానితో కలిసి చేసిన `దేవదాస్` సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం నాగార్జున `బిగ్బాస్` హౌస్కు వచ్చారు. “బిగ్బాస్` గురించి మీ స్పందన ఏమిటి` అని నాగ్ను నాని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన నాగ్.. “బిగ్బాస్` గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను మాట్లాడితే చెడుగా మాట్లాడాల్సి వస్తుంది. నేను నాని హోస్టింగ్ గురించి మాట్లాడడం లేదు. నాకు అసలు `బిగ్బాస్` కాన్సెప్టే నచ్చలేదు. ఇతరులు ఏమి చేస్తున్నారో? ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించడం బాగుండదు. నాకు అది నచ్చదు. ఈ షో అంతా ఏదో గాసిపింగ్లా ఉంద`ని నాగ్ వ్యాఖ్యానించారు. అప్పుడు అంతలా అసహ్యించుకున్న నాగ్ ఇప్పుడు బిగ్ బాస్ కి ఎలా హోస్ట్గా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తు ట్రోల్ చేస్తున్నారు