బిగ్ బాస్ లవ్ ట్రాక్.. పెళ్లి చేసుకుంటే 2 కోట్ల బంపర్ ఆఫర్బిగ్ బాస్ లవ్ ట్రాక్.. పెళ్లి చేసుకుంటే 2 కోట్ల బంపర్ ఆఫర్
బిగ్ బాస్ లవ్ ట్రాక్.. పెళ్లి చేసుకుంటే 2 కోట్ల బంపర్ ఆఫర్

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి 50 లక్ష ప్రైజ్ మనీను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. తెలుగులో, తమిళంలో మూడో సీజన్ ముగిసింది కానీ ఇప్పుడు హిందీలో 13వ సీజన్ నడుస్తోంది. అయితే చివరికి వచ్చేసిన ఈ సీజన్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. దానికి కారణం రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ మధ్య ఉన్న లవ్ ట్రాక్. వీరిద్దరూ సీజన్ మొదలైన దగ్గరనుండి క్లోజ్ గా ఉండడం, చిలిపి గొడవలు, అలకలు, ఇలా అన్ని రకాలుగా ఆడియన్స్ ను అలరించారు. వీరిద్దరూ కలిసి ఉండడాన్ని ప్రేక్షకులు కోరుకున్నారు.

ఈ పెయిర్ గురించి చదువుతుంటే రీసెంట్ గా మనకు బిగ్ బాస్ 3 లో జరిగిన రాహుల్ – పునర్నవి లవ్ ట్రాక్ గురించి గుర్తురావడం అత్యంత సహజం. హౌజ్ లో ఉన్నప్పుడు అత్యంత క్లోజ్ గా లవర్స్ లాగా మెలిగారు ఈ ఇద్దరూ. పైగా ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నట్లు కలరింగ్ కూడా ఇచ్చారు. హౌజ్ లో ఉన్నప్పుడు హగ్ లు, కిస్సులు, ఎప్పుడూ వీరిద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం.. ఇలా వివిధ కారణాల వల్ల వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ప్రేక్షకులకు బాగా అనిపించింది. నిజానికి ఇద్దరూ కలిసి ఉండాలని చెప్పి, ఇద్దరిలో ఎవరైనా నామినేషన్స్ లో ఉంటే వారిని కాపాడుతూ వచ్చారు. నిజానికి ఈ రిలేషన్ రాహుల్ కు బాగా ప్లస్ అయింది. తన సింగింగ్ టాలెంట్ తో పాటుగా ఈ రిలేషన్ కూడా ఉండడంతో రాహుల్ చివరి వరకూ షో లో నిలిచి చివరికి విజేతగా నిలిచాడు. చివరికి షో ముగిసి ఇద్దరూ బయటకు వచ్చాక తమ మధ్య అలాంటిదేం లేదని, తామిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హిందీ వెర్షన్ కు వెళితే అక్కడ కూడా ఇలానే నడుస్తోంది. రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ జంటను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడడం మొదలుపెట్టారు. అది ఎంతలా అంటే మధ్యలో అర్హన్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయినా తిరిగి వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపించారు. లోపలికి వెళ్లిన అర్హన్ ఖాన్ గోల్డ్ రింగ్ తీసుకుని రష్మీకి ప్రపోజ్ చేద్దామనుకుంటే ఆమె విచిత్రంగా తనని లైట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఏదేమైనా ఈ జంట బిగ్ బాస్ లో హాట్ టాపిక్. రష్మీ అయితే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి క్లోజ్ నెస్ ను చూసిన బిగ్ బాస్ కూడా, వీరు కనుక షో అయ్యాక పెళ్లి చేసుకుంటే 2 కోట్లు బహుబతి ఇస్తామంటూ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఈ జంట ఏం చేస్తుందో చూడాలి. నిజంగానే బిగ్ బాస్ ఈ ఆఫర్ కు కట్టుబడి ఉంటాడా లేక పబ్లిసిటీ కోసం ఇలా చెప్పాడా?