నాని -లారెన్స్ లలో హిట్ కొట్టేది ఎవరు ?

నాని నటించిన జెర్సీ , లారెన్స్ నటించిన కాంచన 3 రెండు చిత్రాలు కూడా ఒకేరోజున అంటే ఈనెల 19 న విడుదల అవుతుండటంతో ఇద్దరు హీరోలలో హిట్ కొట్టేది ఎవరో అన్న ఆత్రుత నెలకొంది ప్రేక్షక లోకంలో . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ చిత్రంలో నాని క్రికెట్ ప్లేయర్ గా నటించాడు . ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లతో జెర్సీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దాంతో మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం .

ఇక హర్రర్ కథాంశం నేపథ్యంలో ముని , గంగ , కాంచన చిత్రాలు చేసాడు రాఘవ లారెన్స్ . ఆ మూడు చిత్రాలు కూడా పెద్ద హిట్స్ అయ్యాయి దాంతో ఈ నాలుగో సినిమా అయిన కాంచన 3 మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి . నవ్వించడంతో పాటు భయపెడతాడు లారెన్స్ దాంతో కాంచన 3 నాని జెర్సీ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం . నాని సినిమా ఒక టైపు , లారెన్స్ సినిమా ఒక టైపు దాంతో ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అవుతుంది ? ఎవరు హిట్ కొడతారు అన్న ఆసక్తి నెలకొంది . ఎవరు ఏంటి ? అన్నది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే .