ఎన‌ర్జిటిక్ స్టార్ చిత్రానికి టెమ్టింగ్ ఆఫ‌ర్‌?


ఎన‌ర్జిటిక్ స్టార్ చిత్రానికి టెమ్టింగ్ ఆఫ‌ర్‌?
ఎన‌ర్జిటిక్ స్టార్ చిత్రానికి టెమ్టింగ్ ఆఫ‌ర్‌?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ న‌టిస్తున్న తాజా థ్రిల్ల‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళ‌విక‌శ‌ర్మ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ , పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నీ పూర్త‌య్యాయి. అంతా స‌వ్యంగా వుంటే ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన చిత్ర‌మిది. మేక‌ర్స్ కూడా ఏప్రిల్‌లో రిలీజ్‌కు ప‌క్కా ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో రిలీజ్ ప్లాన్ అంతా తారుమారైపోయింది.

దీంతో థియేట‌ర్స్ ఎప్పుడు రీ ఓపెన్ అయితే అప్పుడు రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించుకుంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ భార‌త్‌లో విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌తాపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో థియేట‌ర్లు రీఓపెన్ చేసేలా ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిస్థితుల్ని అనుకూలంగా మ‌లుచుకుంటున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రామ్ `రెడ్‌` చిత్రానికి గ‌తంలో భారీ ఆఫ‌ర్ ఇచ్చాయి. 25 కోట్లు ఇచ్చేస్తామ‌ని, సినిమాని ఇచ్చేయ‌మ‌ని, ఆ త‌రువాత థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకోమ‌ని భారీ డీల్‌ని తెర ముందుకు తెచ్చాయి. అయితే ఈ డీల్‌ని చిత్ర బృందం, హీరో రామ్ సున్నితంగా తిర‌స్క‌రించారు. తాజాగా క‌రోనా ఊహించిన దానికి భిన్నంగా విళ‌యాన్ని సృష్టిస్తున్న నేప‌థ్యంలో స‌ద‌రు ఓటీటీ సంస్థ ఈ సారి 5 కోట్లు పెంచి 30 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిందంట. ఆఫ‌ర్ టెమ్టింగ్‌గా వుండ‌టంతో చిత్ర వ‌ర్గాలు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం.