మహేష్ చరణ్ రికార్డ్ ని బద్దలు కొట్టగలడా


 Big target for maheshరాంచరణ్ రంగస్థలం భారీ విజయం సాధిస్తూ 175 కోట్ల గ్రాస్ ని వంద కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టిస్తుండగా మహేష్ బాబు కు పెద్ద సవాల్ నే ముందుంచాడు చరణ్ . ఈనెల 20న మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదల అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం , శ్రీమంతుడు తర్వాత మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రంగస్థలం 200 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో మహేష్ ముందు సవాల్ నిలిచింది. ఇప్పుడు మహేష్ చరణ్ రికార్డ్ ని బద్దలు కొట్టాలంటే 110 కోట్ల కు పైగా షేర్ ని 220 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయాలి. మరి అంతటి సంచలనం ని మహేష్ సాధిస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు ఘోర పరాజయం పొందాయి దాంతో మహేష్ కు ఇది పెద్ద సవాలే .