బిగ్‌బాస్ బ్యూటీకి ప‌వ‌న్ కూడా ఆఫ‌రిచ్చాడా?


బిగ్‌బాస్ బ్యూటీకి ప‌వ‌న్ కూడా ఆఫ‌రిచ్చాడా?
బిగ్‌బాస్ బ్యూటీకి ప‌వ‌న్ కూడా ఆఫ‌రిచ్చాడా?

బిగ్‌బాస్ సీజ‌న్ 4తో దివి వద్యా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. టాప్ 5కి చేరుకోకుండానే హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన దివికి టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి. మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` లాంటి చిత్రాల్లో చిన్న పాత్ర‌ల్లో న‌టించిన దివికి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

త‌ను న‌టించ‌నున్న `వేదాలం` రీమేక్‌లో దివికి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రని ఇస్తున్నాన‌ని చెప్పి మెగాస్టార్ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీతో పాటు ప‌లు చిత్రాల్లో న‌టించే అవ‌కావాన్ని ద‌క్కించుకుంటున్న దివికి తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్రంలో న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్ దివిని వెతుక్కుంటూ వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్ర‌మ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీలో దివికి న‌టించే ఛాన్స్ ల‌భించిన‌ట్టు తెలిసింది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.