గుడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ విన్న‌ర్‌!


BigBoss winner anounced one more good news
BigBoss winner anounced one more good news

హుషారైన పాట‌ల‌తో, ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌తో క్రేజ్‌ని సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఇటీవ‌ల జరిగిన బిగ్‌బాస్ 3 రియాలిటీ షోలో 16 మంది కంటెస్టెంట్‌ల‌ని వెన‌క్కి నెట్టి విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ప‌క‌నైజ్ మ‌నీ కింద 60 ల‌క్ష‌లుగెలుచుకున్న రాహుల్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు సోష‌ల్ మీడియా కార‌ణంగా దేవ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాశం అయ్యారు. బిగ్‌బాస్ త‌రువాత నుంచి నిత్యం ఏదో ఓ అంశం కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు.

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ చిత్రం `రంగ‌మార్తాండ‌`తో న‌టుడిగా తెరంగేట్రం చేస్తూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన రాహుల్ తాజాగా మ‌ళ్లీ వార్త‌ల కెక్కారు. అయితే ఈ సారి త‌న ప్రేమ గురించి కాకుండా సొంత ఇంటి విష‌యంలో వార్త‌ల్లో నిలిచారు. బిగ్‌బాస్‌3లో త‌మ‌కు సిటీలో సొంత ఇల్లు లేద‌ని చెప్పిన రాహుల్ త‌న‌కు ల‌భించిన ప్రైజ్ మ‌నీతో తాజాగా సొంత ఇంటికి కొనుక్కున్న‌ట్టు వెల్ల‌డించాడు. ఇటీవ‌ల బెంజ్ కారుని కొనుగోలు చేశాన‌ని, ఆ వార్త‌ని, కారుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న రాహుల్ తాజాగా త‌న సొంత ఇంటి క‌ల‌ని కూడా నెర‌వేర్చుకున్నాన‌ని చెప్ప‌డం విశేషం.

అయితే రాహుల్ కొన్న ఇల్లు మ‌రో ఏడు నెల‌ల్లో పూర్తి కానుంద‌ని తెలిసింది. ఫ్లాట్ కొన్న త‌రువాతే బెంజ్ కారుకి గాలం వేశాన‌ని, కాబ‌ట్టి టెన్ష‌న్ ప‌డ‌కండ‌ని త‌న కాంపిటేట‌ర్‌కి హింట్ ఇచ్చాడు. జ‌స్ట్ చిల్ అంటూ రాహుల్ పెట్టిన పోస్ట్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.