బిగ్ బాస్ విన్నర్ కు బిగ్ బాస్ నచ్చలేదట


బిగ్ బాస్ విన్నర్ కు బిగ్ బాస్ నచ్చలేదట
బిగ్ బాస్ విన్నర్ కు బిగ్ బాస్ నచ్చలేదట

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్, తెలుగులో ఫస్ట్ సీజన్ వరకూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ షో, అందులో టాస్క్స్ మనకు చాలా కొత్త కావడంతో ఎంటర్టైన్మెంట్ విషయంలో లోటు లేకుండా పోయింది. దానికి తోడు ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా షోను సూపర్ గా నడిపించడంతో ప్రేక్షకులు ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యారు. సెకండ్ సీజన్ కూడా కౌశల్ వల్ల సూపర్ గా నడిచింది.

కానీ మూడో సీజన్ లో అటు నాగార్జున హోస్టింగ్ కూడా యావరేజ్ గా ఉంది. అసలు కంటెస్టెంట్స్ ను క్వెశ్చన్ చేయడమే మానేసాడు. క్వెశ్చన్ చేసినా కూడా అది పూర్తి స్థాయిలో అవ్వకపోవడంతో కంటెస్టెంట్స్ లో భయం ఫ్యాక్టర్ మిస్ అయింది. మరోవైపు కంటెస్టెంట్స్ కూడా సేఫ్ గేమ్ అంటూ కూర్చుని అసలు ఎంటర్టైన్మెంట్ అన్నదే ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ పూర్తిగా నీరుగారిపోయినట్లయింది.

ఈ మాటలు అంటున్నది మేము కాదు, బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ. మూడో సీజన్ కు తాను అసలు కనెక్ట్ కాలేకపోయానని, చూసిన కొద్ది రోజుల్లోనే ఈ సీజన్ ఎలా ఉండనుండో క్లారిటీ వచ్చేసింది. అందుకే ఎక్కువగా చూడలేదు. దానికి తోడు నేను కూడా కమిట్మెంట్స్ కారణంగా బిజీ అవ్వడంతో బిగ్ బాస్ చూడటమే మానేసానని అన్నాడు శివ బాలాజీ. మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ కు బిగ్ బాస్ నచ్చలేదన్నమాట.