పవన్ , ప్రభాస్ అంటే చాలా ఇష్టమంటున్న భామ


bigg boss 2 hottiiee bhanu sree wants pawan and prabhas పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లంటే నాకు చాలా చాలా ఇష్టమని అంటోంది బిగ్ బాస్ 2 లో పాల్గొని వివాదం సృష్టించిన భాను శ్రీ రెడ్డి . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ బాహుబలి లో తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది . బాహుబలి లో పోషించింది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి గుర్తింపు తేవడంతో వరుసగా చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ లభించింది . ఇక ఇప్పుడేమో బిగ్ బాస్ 2 లో ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది . అయితే బిగ్ బాస్ 2 షోలో కౌశల్ తన ఎదపై చేతులు కావాలనే వేసాడని ఆరోపించి వివాదాన్ని సృష్టించింది దాంతో ఈ భామ ఆ షో నుండి ఎలిమినేట్ అయ్యింది .

కట్ చేస్తే బయటకు వచ్చిన ఈ వరంగల్ భామ పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అంటే ఇష్టమని అంటోంది భానుశ్రీ రెడ్డి . కాటమ రాయుడు చిత్రంలో నేను కూడా నటించానని అప్పుడు పవన్ కళ్యాణ్ ని దగ్గరగా చూశానని చాలా మంచి వ్యక్తని , ఇక ప్రభాస్ అంటే ఎనలేని ఇష్టమని ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలనేది నా కోరిక అని అంటోంది . గ్లామర్ పాత్రలతో అలరిస్తున్న ఈ భామ శివశంకర్ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశపడుతోంది .

English Title: bigg boss 2 hottiiee bhanu sree wants pawan and prabhas