బిగ్ బాస్ 2 కి కష్టాలు


bigg boss 2 in trouble

బిగ్ బాస్ మొదటి సిరీస్ విజయవంతం అయ్యింది దాంతో బిగ్ బాస్ 2 కి సన్నాహాలు చేశారు. తెలుగులో బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ఇప్పుడు బిగ్ బాస్ 2 కి మాత్రం నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తమిళ్ లో అయితే కమల్ హాసన్ మొదటి సిరీస్ ని సక్సెస్ చేసి ఇప్పుడు సెకండ్ సీజన్ కు కూడా తనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది కాని బిగ్ బాస్ 2 తమిళ్ సీజన్ కు కష్టాలు వచ్చి పడ్డాయి. బిగ్ బాస్ తమిళనాట షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ షూటింగ్ లో 75 శాతం మంది కార్మికులు , సాంకేతిక నిపుణులు ముంబై నుండి వచ్చిన వాళ్లే నట ! దాంతో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

గతంలో కూడా బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఇలాగే చేశారు. అప్పుడు కమల్ హాసన్ తో మాట్లాడితే ఇక్కడి వాళ్ళని సగం మందిని తీసుకున్నారు. మళ్లీ ఆ పొరపాటు జరగదని చెప్పారు కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. కమల్ హాసన్ తో మరోసారి చర్చలు జరుపుతాం , మా వాళ్ళని యాభై శాతం పెట్టుకొని తీరాల్సిందే లేకపోతే షూటింగ్ ని జరగనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు దక్షిణ భారత ఫిల్మ్ ఫెడరేషన్ సంఘం వాళ్ళు. మరి కమల్ ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తాడో చూడాలి. తమిళనాట కూడా బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది మరి ఈ బిగ్ బాస్ 2 ఏ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

English Title: bigg boss 2 in trouble