బిగ్ బాస్ 2 లో పాల్గొనే భామలు వీళ్ళే నట


bigg boss 2 telugu contestents list

రాశి , తేజస్వి మదివాడ , గీతా మాధురి , శ్యామల ,గజాల వీళ్లంతా బిగ్ బాస్ 2 సీజన్ లో పాల్గొనబోయే భామలు అని తెలుస్తోంది . బిగ్ బాస్ మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ కావడంతో రెండో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది . ఈ రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తుండగా మాజీ హీరోయిన్ లైన రాశి , గజాల లతో పాటుగా తేజస్వి మదివాడ , సింగర్ గీతా మాధురి ,అలాగే ట్రాన్స్ జెండర్ శ్యామల లు బిగ్ బాస్ 2 లో పాల్గొననున్నారు అని తెలుస్తోంది .

బిగ్ బాస్ షో అంటే గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే ఇక్కడ కనిపిస్తున్న వాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లంతా ఫేడౌట్ అయిన వాళ్ళని ఎంపిక చేసారు అయితే వీళ్ళతో పాటుగా మధ్యలో కైపెక్కించే వాళ్ళని కూడా పంపిస్తారని అంటున్నారు . ఇక మగవాళ్ల విషయానికి వస్తే ఎవరెవరిని ఎంపిక చేయనున్నారో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది .