ఆ నటికి బిగ్ బాస్ న్యాయం చేస్తాడా ?


Madhumita
Madhumita

తమిళ నటి మధుమిత నాకు న్యాయం కావాలి అని బిగ్ బాస్ ని వేడుకుంటోంది . కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ లో నటి మధుమిత కూడా పాల్గొంది . బిగ్ బాస్ 3 హౌజ్ లో ఏకంగా 50 రోజుల పాటు ఉంది అయితే 50 వ రోజున ఆత్మహత్యయత్నం కు పాల్పడింది మధుమిత దాంతో ఆగ్రహించిన బిగ్ బాస్ మధుమిత ని హౌజ్ నుండి బయటకు పంపించాడు .

అయితే బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చిన మధుమిత పై బిగ్ బాస్ నిర్వాహకులు కేసు పెట్టారు . దాంతో షాక్ అయిన మధుమిత 50 రోజుల పాటు హౌజ్ లో ఉన్నందుకు నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఇలా కేసు కూడా పెట్టడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . అంతేకాదు దీనికి కమల్ హాసన్ మాత్రమే న్యాయం చేయగలడు అని అతడి కోసం నిరీక్షిస్తోందట . అయితే కమల్ కానీ బిగ్ బాస్ కానీ మధుమిత కు న్యాయం చేస్తారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .