బిగ్ బాస్ 3 కి కౌంట్ డౌన్ స్టార్ట్స్


Bigg boss 3 Count down start
Bigg boss 3 Count down start

బిగ్ బాస్ 3 కి కౌంట్ డౌన్ స్టార్ట్స్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ 3 మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది . ఒకవైపు బిగ్ బాస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా , ఉస్మానియా విద్యార్థులు హెచ్చరికలు జారీ చేస్తున్నా బిగ్ బాస్ కు కలిసి వస్తున్నాయి , మరింత క్రేజ్ ని తెచ్చిపెడుతున్నాయి కానీ ఎక్కడా తగ్గడమే లేదు .

ఇక ఇప్పటికే నాగార్జున యాంకర్ గా తన సత్తా ఏంటో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా నిరూపించుకున్నాడు కాబట్టి తప్పకుండా బిగ్ బాస్ 3 ని మరో లెవల్ కి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు . మొదటి సీజన్ కు ఎన్టీఆర్ , రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించగా మూడో సీజన్ కు కింగ్ వస్తున్నాడు . ఇక కొద్ది సేపట్లోనే బిగ్ బాస్ 3 స్టార్ట్ కానుంది , అలాగే అందులో పాల్గొనే వాళ్ళ వివరాలు కూడా తెలియనున్నాయి .