బిగ్ బాస్ 3లో ఫైనల్స్ కు వెళ్ళేది వీళ్లేనా?


బిగ్ బాస్ 3లో ఫైనల్స్ కు వెళ్ళేది వీళ్లేనా?
బిగ్ బాస్ 3లో ఫైనల్స్ కు వెళ్ళేది వీళ్లేనా?

బిగ్ బాస్ 3 ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంటోంది. హౌజ్ లో ఇంకా ఎనిమిది మంది ఉన్నారు. అందులోంచి ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవుతారు. నామినేట్ అయిన వరుణ్, మహేష్, రాహుల్ లలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూస్తే మహేష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాహుల్, మహేష్ కు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడంతో వీళ్ళే కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అని చెప్పలేని పరిస్థితి.

ఇక రానున్న మూడు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ ఫైనల్స్ కు వెళ్లడం లాంఛనమే అనిపిస్తోంది. ఇక రెండు స్లాట్స్ మిగిలున్నాయి. వరుణ్ కు ఫైనల్స్ కు వెళితే వితికను పంపకూడదని బిగ్ బాస్ అనుకుంటోందని సమాచారం. భార్యాభర్తలిద్దరూ ఫైనల్స్ కు చేరితే అంత బాగోదని నిర్వాహకులు భావిస్తున్నారు. సో, వితిక రానున్న రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వడం ఖాయం.

మహేష్ ఈ వారం వెళ్లిపోతే అలీ వచ్చే వారం వెళ్లేలా ఉన్నాడు. అలీ రెజాకు ఎలిమినేట్ అయినప్పుడు వచ్చిన క్రేజ్, రీ ఎంట్రీ తర్వాత లేదు. పైగా వెనకాల మాటలు ఎక్కువవడంతో అలీకి నెగటివిటీ పెరిగింది. సో, అలీ కూడా ఫైనల్స్ కు వెళ్లే ఛాన్సెస్ లేవు. ఈ రకంగా చూసుకుంటే శివజ్యోతి, రాహుల్ లు ఫైనల్స్ లో అడుగుపెట్టడం ఖాయం. ఒకవేళ ఈ వారం రాహుల్ ఎలిమినేట్ అయితే మహేష్ ఫైనల్స్ కు చేరుకుంటాడు.